క్లైమేట్ డైనమిక్స్ సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ

రిపోర్టర్: నరేష్ స్థలం: New Delhi

భవిష్యత్ పర్యావరణం మరియు వాతావరణ గతిశీలతపై అంతర్జాతీయ సదస్సును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై పోరుకు భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పర్యావరణ రక్షణకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.