రాయచోటిలో ఆయుధాలతో బౌన్సర్ల కలకలం: లైసెన్సులపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం
రిపోర్టర్: విజయ్
స్థలం: రాయచోటి
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమయంలో రాయచోటిలో ఆయుధాలతో పట్టుబడిన కిరాయి బౌన్సర్ల వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాము విశ్రాంత ఆర్మీ ఉద్యోగులమని, తమ వద్ద ఉన్న తుపాకులకు లైసెన్సులు ఉన్నాయని నిందితులు చెబుతున్నట్లు డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. అయితే ఆ ఆయుధాలకు చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా లేదా అన్నది పత్రాల పరిశీలన ద్వారా తేలనుందని, ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని ఆయన స్పష్టం చేశారు.