విద్యార్థులకు తీపి కబురు: ఏపీలో నేటి నుంచే దసరా సెలవులు

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ దసరా పండుగ సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ పదో తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు వర్తిస్తాయని విద్యాశాఖ పేర్కొంది. క్రిస్టియన్ ఎయిడెడ్ పాఠశాలలకు మాత్రం షెడ్యూల్లో స్వల్ప మార్పులు ఉంటాయని వెల్లడించారు. విద్యార్థులు కుటుంబసభ్యులతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని అధికారులు ఆకాంక్షించారు.