ఛలో ఢిల్లీ మహా ర్యాలీ: నవంబర్ ఒకటో తేదీన రామ్లీలా మైదానంలో ఆందోళన

రిపోర్టర్: రాజేష్ స్థలం: Delhi

ఓట్లను పరిరక్షించుకోవాలని పిలుపునిస్తూ నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో చలో ఢిల్లీ ఓట్ బచావ్ దేశ్ బచావ్ మహా ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో భారీ ప్రదర్శన చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.