భారతీయ సినిమా చర్చే మార్చేలా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన రామాయణ చిత్రం
రిపోర్టర్: సతీష్
స్థలం: Hyderabad
భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పౌరాణిక దృశ్యకావ్యం రామాయణ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైందని సినీ వర్గాలు వెల్లడించాయి. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా నటించగా, యష్ రావణాసురుడి పాత్రలో కనిపించారు. సుమారు పదహారు వందల కోట్ల భారీ వ్యయంతో ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ పై ఈ చిత్రాన్ని నిర్మించారని చిత్ర బృందం తెలిపింది.