ప్రకృతి వ్యవసాయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ: సీఎం చంద్రబాబు వెల్లడి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
ప్రకృతి వ్యవసాయంలో ఏపీ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం పెంపుపై నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. నాల్గవ వందల మందితో ప్రారంభమై నేడు లక్షలాది మందికి చేరువైందని పేర్కొన్నారు. రసాయన ఎరువులతో భూసారం క్షీణిస్తుందని, ప్రకృతి సాగుతో ఆదాయం పెరుగుతుందని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో పది లక్షల పంటకుంటలు తవ్వించామని, దేశీయ ఆవుల సంఖ్య పెంచేందుకు గోకులాలు నిర్మిస్తామని చంద్రబాబు వెల్లడించారు.