మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మక లోపాలు
రిపోర్టర్: రాము
స్థలం: Amaravati
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరించిన వ్యూహాత్మక విధానాలే భారీ ఓటమికి కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణ స్థానిక సంస్థలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించకుండా కేవలం పులివెందుల నియోజకవర్గంపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించిందని పలువురు స్పష్టం చేస్తున్నారు. గెలుపోటముల కంటే కేవలం పోటీ చేయడం ముఖ్యమంటూ ఇచ్చిన పిలుపు క్షేత్రస్థాయి కేడర్ లో నిరాశావాదానికి దారితీసిందని పేర్కొన్నారు.