హైవేపై భారీ ట్రాఫిక్ జామ్: కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
రిపోర్టర్: సునీల్
స్థలం: యాదాద్రి భువనగిరి
సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ రద్దీతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద వేలాదిగా వాహనాలు క్యూ కట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు తెలిపారు. చౌటుప్పల్ వద్ద ఫ్లై ఓవర్ పనుల కారణంగా ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. రద్దీని నియంత్రించేందుకు పోలీసులు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.