తీవ్ర తుఫాను ముప్పు: బాపట్ల-విశాఖ మధ్య యానాం వద్ద తీరం దాటే అవకాశం

రిపోర్టర్: కృష్ణ స్థలం: విశాఖపట్నం

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను రానున్న పన్నెండు గంటల్లో మరింత బలపడి బాపట్ల-విశాఖ మధ్య యానాం వద్ద తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గరిష్టంగా నూట నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. తుపాను తీవ్రత దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో పాటు, పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.