యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలి మనవడి వేధింపులతో యువకుడు ఆత్మహత్య
రిపోర్టర్: రాము
స్థలం: ఎల్బీ నగర్ / యాదగిరిగుట్ట
ఎల్బీ నగర్ కాంగ్రెస్ నాయకురాలు, యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ మనవడి వేధింపులు తాళలేక ఓ గిరిజన యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. మృతుడి తల్లితో ఈశ్వరమ్మ యాదవ్ సెటిల్మెంట్కు దిగినట్లు చెప్తున్న కాల్ రికార్డింగ్ లీక్ కావడం కలకలం రేపింది. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.