ఆర్థిక సంక్షోభ సమయంలో భారత్ అండగా నిలిచిందంటూ శ్రీలంక మంత్రి ప్రశంసలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: న్యూఢిల్లీ

గతంలో తమ దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న తరుణంలో సమయానికి స్పందించి ఆదుకున్న భారత ప్రభుత్వానికి శ్రీలంక ప్రభుత్వం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు శ్రీలంక పరిశ్రమలు, వ్యవస్థాపక అభివృద్ధి శాఖ డిప్యూటీ మంత్రి చతురంగ అబేసింఘే వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రతిష్టాత్మక సదస్సులో ఆయన మాట్లాడుతూ, అత్యంత కష్టతరమైన పరిస్థితుల్లో భారత్ తమకు ఒక భరోసాగా, వెన్నెముకలా నిలిచిందని ప్రశంసించారు.