అమెరికాలో సంచలనం: పైథాన్ ఛాలెంజ్లో చరిత్ర సృష్టించిన మహిళ

రిపోర్టర్: రాము స్థలం: Florida

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన వార్షిక పైథాన్ ఛాలెంజ్లో టేలర్ స్టాన్బెర్రీ అరుదైన రికార్డు సృష్టించారని ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కమిషన్ అధికారులు వెల్లడించారు. పది రోజుల పోటీలో ఏకంగా అరవై భారీ కొండచిలువలను పట్టుకుని ఆమె అల్టిమేట్ గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్నారు. సుమారు నాలుగు అడుగుల పదకొండు అంగుళాల ఎత్తుండే ఈ యువతి, ఈ ఘనత సాధించిన మొదటి మహిళగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు.