మహాత్మా గాంధీ జయంతి వేడుకలు: ఘన నివాళులర్పించిన జిల్లా అదనపు ఎస్పీ

రిపోర్టర్: రాము స్థలం: నాగర్ కర్నూల్

మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ఎస్పీ నాగర్ కర్నూల్ (SP Nagarkurnool) వెల్లడించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి జిల్లా అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు ఘన నివాళులర్పించారు. అహింసా మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని పూలమాలలు సమర్పించారు.