పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత: ఎనిమిదో వార్డు రీపోలింగ్ కు అధికారుల గైర్హాజరు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: పులివెందుల
వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ ఎనిమిదో వార్డులో రీపోలింగ్ కేంద్రానికి సమయం దాటినా తాళాలు వేసి ఉండటం తీవ్ర గందరగోళానికి దారితీసిందని స్థానికులు తెలిపారు. ఆదివారం ఉద్రిక్తతల నేపథ్యంలో సోమవారం జరగాల్సిన రీపోలింగ్ కు అధికారులు, సిబ్బంది గైర్హాజరు కావడంతో ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రాజకీయ నేతలు, ప్రజలు అయోమయానికి గురవుతూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.