మచ్చ బొల్లారం ట్రాన్స్ఫర్ స్టేషన్ తరలింపు: ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలు

రిపోర్టర్: శివ స్థలం: మేడ్చల్

మచ్చ బొల్లారంలోని హిందూ శ్మశాన వాటిక వద్ద ఉన్న వ్యర్థాల ట్రాన్స్ఫర్ స్టేషన్ను మరోచోటికి తరలించే ప్రక్రియ వేగవంతమైందని ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలు విజయ భారతి సయాని తెలిపారు. జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి గుర్తించిన నాలుగు ప్రత్యామ్నాయ స్థలాలను శుక్రవారం ఆమె అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారిశుధ్య సమస్యలు, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ పద్ధతిలో తగిన ప్రాంతాన్ని ఎంపిక చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.