భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వృద్ధురాలపై అమానుష ఘటనపై మానవ హక్కుల కమిషన్ సుమోటో

రిపోర్టర్: విజయ్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెంలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలికి దయ్యం పట్టిందనే మూఢనమ్మకంతో కుటుంబసభ్యులు ఆమెపై హింసకు పాల్పడిన ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. వృద్ధురాలిని ఊరికి దూరంగా తీసుకెళ్లి చెట్టు ఎక్కించి కొరడాలతో కొట్టినట్టు వచ్చిన ఆరోపణలపై స్పందించిన కమిషన్‌, దీనిపై పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.