స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్న వైఎస్ జగన్

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్లతో కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజాదరణ ఉన్న బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని ఆయన స్పష్టం చేశారు. అధికార పక్షం పోలీసు బలగాలను ఉపయోగించి అడ్డదారుల్లో గెలిచేందుకు కుట్రలు చేసే అవకాశముందని, వాటిని పార్టీ శ్రేణులు ధైర్యంగా తిప్పికొట్టాలని జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.