ఆరోగ్య పరిరక్షణకై మునగపాకలో కొనసాగుతున్న జాతీయ పోషణ మాసోత్సవాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మునగపాక
మునగపాక మండలంలో తొమ్మిదవ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా మూడో రోజు మడకపాలెం అంగన్వాడీ కేంద్రంలో ఆహార వైవిధ్యం, ప్రొటీన్ ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ కేఎంఎస్ జయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో చూచుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ తరణి పాల్గొని ప్రొటీన్ ఆహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, ఆశా వర్కర్ జి.మహాలక్ష్మి, ఆయా ఎస్.హేమలతతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.