ట్యాంక్‌బండ్ బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా విజయ్ రష్మిక
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నేడు సాయంత్రం జరిగే సద్దుల బతుకమ్మ వేడుకల్లో టాలీవుడ్ ప్రముఖ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రత్యేక అతిథులుగా పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన ఈ పూల పండుగ వేడుకలకు ఈ జంట హాజరవుతుండటంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఇటీవల రణబాలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీరు, ఈ సాంస్కృతిక వేడుకల్లో పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.