పెదకాకాని మండలంలో లబ్ధిదారులకు నూతన స్పౌజ్ పెన్షన్ల పంపిణీ

రిపోర్టర్: వెంకట్ స్థలం: గుంటూరు

గుంటూరు జిల్లా పెదకాకాని మండల అభివృద్ధి కార్యాలయం వద్ద నంబూరు, పెదకాకాని, వెంకటకృష్ణాపురం, తంగ్గెళ్లమూడి గ్రామాలకు చెందిన పది మంది లబ్ధిదారులకు నూతన స్పౌజ్ పెన్షన్లను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వెల్లడించారు. స్థానిక నాయకులతో కలసి ఆయన ఈ పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్క పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు పూర్తిగా అందేలా చేయడమే తమ ప్రధాన కర్తవ్యమని ఈ సందర్భంగా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు.