వైసీపీకి షాక్ ఇస్తూ టీడీపీలోకి పోటెత్తిన వలసలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వడమాలపేట
తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్ బి ఆర్ పురం గ్రామంలో మాజీ సర్పంచ్ మణిరాజు ఆధ్వర్యంలో ఇరవై కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. స్థానిక ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వీరంతా స్వచ్ఛందంగా పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.