హైదరాబాద్లో ఘనంగా సైనాథాన్ 3.0: రెండు వేల మందికి పైగా భాగస్వామ్యం
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో ఆశ్రయ్ ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో శనివారం సైనాథాన్ మూడు గంటల అవగాహన రన్ అత్యంత వైభవంగా జరిగింది. వినికిడి లోపం ఉన్న వ్యక్తుల కమ్యూనికేషన్ అవసరాలు, భారతీయ సైగల భాషపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. వివిధ కార్పొరేట్ సంస్థలు, విద్యాసంస్థల విద్యార్థులు, ప్రజలతో కలిపి రెండు వేల ఐదు వందలకు పైగా మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ విషయాన్ని నిర్వాహకులు ప్రత్యేకంగా వెల్లడించారు.