వినూత్నంగా కొలువుదీరిన వినాయక ప్రతిమ

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

విజయనగరం స్థానిక జొన్నగుడ్డి చివరవీధి యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను అత్యంత వినూత్నంగా నిర్వహించారు. బూస్ట్, హార్లిక్స్, బోర్న్ విటా మరియు అమూల్య ప్యాకెట్లను ఉపయోగించి సుందరమైన గణనాథుడి విగ్రహాన్ని తయారు చేశారు. ఈ ప్రత్యేక ప్రతిమను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రజలందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు కలగాలని కోరుకుంటూ భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.