గెలిపించి సీతానగరం మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పార్వతీపురం

పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణంగా అండగా నిలవాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. జడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సీతానగరం మండలం అన్ని రంగాలలో పూర్తిగా వెనుకబడిపోయిందని ఆయన తీవ్రంగా విమర్శించారు.