దేవునిగూడ కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవ ఎన్నికతో జోష్ నింపిన శ్రేణులు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందు నాయక్ ఆధ్వర్యంలో జన్నారం మండలంలోని దేవునిగూడ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కమిటీ సభ్యులను ఘనంగా అభినందించారు.