బాపట్ల జిల్లా అభివృద్ధికి రూ.102.54 కోట్ల SASCI నిధులు
రిపోర్టర్: సతీష్
స్థలం: బాపట్ల
బాపట్ల జిల్లా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రూ.102.54 కోట్ల SASCI నిధులను కేటాయించింది. ఈ నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు బలోపేతం చేయడంతో పాటు, రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. దీని ద్వారా జిల్లాలో రవాణా సౌకర్యాలు మెరుగై ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ లభించనుంది.