ప్రతి విద్యార్థి మొక్కలు నాటి వాటిని బాధ్యతగా సంరక్షించాలి.. దస్తూరాబాద్ ఎస్సై సాయికుమార్ పిలుపు
రిపోర్టర్: Gone Rachana
స్థలం: దస్తురాబాద్
దస్తూరాబాద్ మండలంలోని మున్యాల్ శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆవరణలో బుధవారం విద్యార్థులతో కలిసి ఎస్సై సాయికుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఇంటి పరిసరాలలో, ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కట్కూరి లలితా రాజేష్, మాజీ ఎంపీటీసీ స్వామి, ఉప సర్పంచ్ లావణ్య మొగిలి, ప్రవీణ్, సత్యగౌడ్, ప్రిన్సిపల్ రచన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.