డ్వాక్రా సొమ్ముల గోల్‌మాల్ ఆరోపణలతో యువకుడు ఆత్మహత్య

రిపోర్టర్: వెంకట్ స్థలం: కాకినాడ

కాకినాడ జిల్లా కరప మండలం అరట్లకట్టకు చెందిన నూలు వీరవెంకటరామ త్రిమూర్తి సత్యేంద్రసతీశ్ డ్వాక్రా సొమ్ముల విషయంలో తప్పుడు ఆరోపణలు రావడంతో మనస్థాపం చెంది ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బ్యాంకు సిబ్బంది, డ్వాక్రా యానిమేటర్ నాగమణి కుమ్మక్కై తనను ఇరికించారని, రూ.5 లక్షల వరకు చెల్లించాలని వేధించారని ఆరోపిస్తూ మృతుడు ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.