హైదరాబాద్‌లో నిరుద్యోగులకు అపాయింట్‌మెంట్ లెటర్స్ అందజేసిన కిషన్ రెడ్డి
రిపోర్టర్: హరి
స్థలం: Hyderabad
హైదరాబాద్‌లోని మాదాపూర్ హోటల్ దాస్ పల్లెలో రోజ్‌గార్ మేళా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేదికగా నూతనంగా ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలను నిరంతరం చేపడుతోందని, యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.