గణేష్ శోభాయాత్రలో నృత్యం చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి

రిపోర్టర్: కృష్ణ స్థలం: నల్లగొండ

నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో గణేష్ శోభాయాత్రలో విషాదం చోటు చేసుకుంది. శనివారం రాత్రి గణేష్ విగ్రహం ముందు స్నేహితులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేసిన సింగారపు బాలయ్య రాము అనే 34 ఏళ్ల యువకుడు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. హాలియాలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేలోపే ఆయన ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. గతంలో ఆయన అన్న కూడా గుండెపోటుతోనే మృతి చెందడం స్థానికులను కలచివేసింది.