పైడితల్లి అమ్మవారి చిత్రంతో అలరించిన యువ కళాకారిణి గౌడు దీక్షిత

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విజయనగరం

విజయనగరం ప్రతిష్టాత్మక శ్రీ పైడితల్లి అమ్మవారి పండగ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అనేకమంది భక్తులు ఘటాలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇదే సమయంలో కుమారి గౌడు దీక్షిత అనే యువతి శ్రీ పైడితల్లి అమ్మవారి రూపాన్ని అద్భుతమైన క్యాన్వాస్ పెయింటింగ్ రూపంలో చిత్రీకరించి ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించింది. ఆమె చూపిన కళాత్మక ప్రతిభకు స్థానిక భక్తులు, ప్రజలు ఆశ్చర్యపోయారు. అమ్మవారి ప్రతిరూపాన్ని ప్రత్యక్షంగా కళ్లకు కట్టినట్లు చిత్రించిన దీక్షితను స్థానికులు, ఆలయ అధికారులు ఎంతగానో కొనియాడారు. ఈ చిత్రం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.