యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధింపునకు వ్యతిరేకంగా నో యూపీఐ డే

రిపోర్టర్: విజయ్ స్థలం: దేశవ్యాప్తంగా

యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా నో యూపీఐ డే నిర్వహించాలని వ్యాపార వర్గాలు నిర్ణయించాయి. డిజిటల్ లావాదేవీలపై అదనపు భారాలు మోపితే వ్యాపారాలు చేయడం కష్టమని ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేశారు. క్యూఆర్ కోడ్ స్కానర్లు, సౌండ్ బాక్సులను నల్లటి బట్టలతో కప్పి ఉంచి నిరసన తెలపనున్నట్లు మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రవీంద్ర తెలిపారు.