తెలంగాణ పట్టణాభివృద్ధికి కేంద్రం భారీ సాయం: ఐదు ప్రాజెక్టులకు ఆమోదం

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఐదు కీలక ప్రాజెక్టులకు కేంద్ర నేషనల్ అపెక్స్ కమిటీ ఆమోదం తెలిపిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా తాగునీరు, వరద నివారణ పనులకు రూ.873.49 కోట్ల కేంద్ర సాయం అందనుందని, దీనివల్ల నగరాల్ లో వసతులు మెరుగుపడటంతో పాటు పర్యాటక రంగానికి కూడా నూతన ఊతం లభిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.