అనారోగ్య బాలికకు పింఛను కోసం పదేళ్లుగా కలెక్టరేట్ చుట్టూ తండ్రి ప్రదక్షిణలు
రిపోర్టర్: గోపి
స్థలం: నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయికి చెందిన వాసుదేవ జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న తన పదమూడేళ్ల కూతురు కీర్తనకు పింఛను మంజూరు చేయాలని కోరుతూ పదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అన్ని ధ్రువపత్రాలు ఉన్నప్పటికీ ఎవరూ కనికరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నానని వాపోతున్నారు. కలెక్టరేట్ అధికారులు ఈ విషయాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి ప్రభుత్వానికి లేఖ రాసినట్లు డీఆర్డీఏ పీడీ నాగరాజ కుమారి తెలిపారు.