కరువు మండలాల్ లో ఉపాధి పనులు ముమ్మరం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లాలో కరువు సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఖమ్మం సుందరయ్య భవన్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలాల్ లో ఉపాధి పనులు రెండు వందల రోజులు కల్పించాలని కోరారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి యాభై వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.