మంగళూరులో ఘోరం: స్కూటర్ను పికప్ ట్రక్తో ఢీకొట్టి ఇద్దరు యువకుల హత్య

రిపోర్టర్: రమేష్ స్థలం: Mangaluru

మంగళూరు నగర పరిధిలోని బొలియార్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారని మంగళూరు నగర పోలీస్ కమిషనర్ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. స్నేహితుడి మొబైల్ ఫోన్ విషయమై జరిగిన వివాదం కారణంగా, హఫీజ్ అనే డ్రైవర్ తన పికప్ ట్రక్తో యువకుల స్కూటర్ను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు జరుపుతున్నారు.