ముంబైలో ఘనంగా గణేష్ నిమజ్జనం నిర్వహించిన రణ్‌బీర్ అలియా కుటుంబం

రిపోర్టర్: మహేష్ స్థలం: Mumbai

ముంబైలో జరిగిన గణేష్ నిమజ్జన వేడుకల్లో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ దంపతులు తమ కూతురు రాహా కపూర్, నీతూ కపూర్‌తో కలిసి పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణలో విచ్చేసిన ఈ కుటుంబం గణపతి పూజా కార్యక్రమాలు నిర్వహించి విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా మీడియా కెమెరాల బారి నుండి తమ కూతురు రాహాను కాపాడుకునేందుకు అలియా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.