దారుణంగా దెబ్బతిన్న బూదరళ్ల పంచాయతీ రహదారి అంచు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: కొయ్యూరు
కొయ్యూరు: బూదరళ్ల పంచాయతీలోని పోకలపాలెం నుంచి గోదుమలంక గ్రామం మధ్యలో బ్రిడ్జి సమీపంలో తారు రోడ్డు ఎడ్జ్ కొట్టుకుపోయింది. రహదారి పక్కన కాలువ నిర్మించకపోవడంతో వర్షపు నీరు ప్రవహించి రోడ్డు అంచు దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి కాలువ నిర్మించి, రహదారిని పునరుద్ధరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.