ఈపీఎఫ్ఓ చందాదారులకు భారీ ఊరట: వాట్సాప్ ద్వారానే పీఎఫ్ బ్యాలెన్స్ సేవలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: New Delhi
ఈపీఎఫ్ఓ 74 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వాట్సాప్ ద్వారా ఈపీఎఫ్ఓ సేవలను ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీని ద్వారా చందాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్, చివరి ఐదు లావాదేవీలు మరియు పాస్ బుక్ సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు. ఆధార్ ధృవీకరించబడిన నిష్క్రియ ఖాతాలకు ఆటోమేటిక్ సెటిల్ మెంట్ విధానాన్ని కూడా మంత్రి ప్రారంభించారు.