ఈసీని అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయాలు: మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో ధ్వజం

రిపోర్టర్: విజయ్ స్థలం: దిల్లీ

కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని పలు రాష్ట్రాల ఎన్నికల్ లో లబ్ధి పొందుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. దిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఇండీ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన చలో దిల్లీ సభలో ఆయన మాట్లాడారు. గతంలో విపక్షాలను అణచివేయడానికి సీబీఐ, ఈడీలను వాడుకున్న కమలనాథులు, ఇప్పుడు సీఈసీని కాపాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు.