విజయవాడ-తిరుపతి మధ్య త్వరలో కొత్త విమాన సర్వీసు ప్రారంభం

రిపోర్టర్: రాము స్థలం: ఎన్టీఆర్ జిల్లా

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తిరుపతికి త్వరలో కొత్త విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. ఎఫ్-91 సంస్థ ద్వారా ఉదయం వేళల్లో ఈ సేవలు నడపనున్నారు. తిరుమల భక్తులకు ప్రయాణ సమయం ఆదా కావడమే కాకుండా, రాజధాని ప్రాంతం నుంచి రాయలసీమకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. అక్టోబర్ నాటికి కొత్త టెర్మినల్ పనులు పూర్తి చేసి, ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకురావడానికి ఎయిర్‌పోర్ట్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.