అక్టోబర్ 9వ తేదీకి వాయిదా పడిన ఆదర్శ కుటుంబం చిత్రం

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ నటిస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా విడుదల తేదీ మారింది. ప్రేక్షకులకు మరింత ఉత్తమమైన వినోదాన్ని అందించే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ఒక వారం ఆలస్యంగా అక్టోబర్ 9వ తేదీన థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.