గోదావరి జలాల లభ్యతపై దిల్లీలో ఏపీ, తెలంగాణ వాదనలు

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

దిల్లీలో జరిగిన జల వివాదాల కమిటీ సమావేశంలో గోదావరి జలాల లభ్యతపై ఏపీ, తెలంగాణ మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. 2023 నాటి నీటి లెక్కలు సరిగాలేవని, శాస్త్రీయంగా లెక్కగట్టాలని ఏపీ తేల్చిచెప్పింది. సముద్రంలోకి నీరు వృథాగా పోతుంటే నల్లమలసాగర్‌కు అభ్యంతరాలు తెలపడం అర్థరహితమని మండిపడింది. తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులపై ఇరువర్గాలు తమ వాదనలను కమిటీ ముందుంచాయి.