డాక్టర్ జగదీష్ మృతికి అంబులెన్స్ యూనియన్ల ఘన నివాళి

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మంలో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ జగదీష్ బాబు అకాల మరణం పట్ల వివిధ అంబులెన్స్ యూనియన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. మూడు యూనియన్ల సంయుక్త ఆధ్వర్యంలో పార్థివ దేహం ముందు అంబులెన్స్ ర్యాలీ నిర్వహించి ఘన నివాళులర్పించారు. వైద్యరంగంలో ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ, ఈ మృతి ఖమ్మం ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు.