ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరిన నారా లోకేశ్

రిపోర్టర్: రమేష్ స్థలం: అమరావతి

గుజరాత్లోని అహ్మదాబాద్లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ, ఫార్మా, టెక్స్టైల్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని టోరెంట్, వెల్స్పన్, గోకుల్ ఆగ్రో సంస్థల ప్రతినిధులను ఆయన కోరారు. ఏపీలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించారు.