టేకులపల్లి అంగన్వాడీ బాలుడి మృతిపై భగ్గుమన్న ప్రజాసంఘాల భారీ ఆందోళన

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

టేకులపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఐదేళ్ల బాలుడు విషాదకర రీతిలో మృతి చెందడంతో ప్రజాసంఘాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి చింతల రమేష్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.