కొత్తవలసలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. యువకుడు దుర్మరణం

రిపోర్టర్: రాము స్థలం: విజయనగరం

విశాఖ-అరకు జాతీయ రహదారిపై కొత్తవలస మండలం తుమ్మికాపల్లి వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని బోని వెంకటేష్‌ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన సిటీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర రక్తస్రావమై యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆగ్రహంతో బస్సు అద్దాలు పగులగొట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.