బాలీవుడ్ నటుడు సంజీవ్ కుమార్ జీవితంపై జర్నలిస్ట్ హనీఫ్ జావేద్ సంచలన విషయాలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ముంబై
బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజీవ్ కుమార్ ప్రారంభ రోజుల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కుటుంబ పోషణ కోసం సీ గ్రేడ్ సినిమాల్లో కూడా పని చేశారని జర్నలిస్ట్ హనీఫ్ జావేద్ వెల్లడించారు. మేరీ సహేలీ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సంజీవ్ కుమార్ కేవలం రెండు జతల బట్టలతో జీవితాన్ని ప్రారంభించారని, అయితే ఆర్థికంగా నిలదొక్కుకున్నాక ఎంతోమందికి ఉదారంగా ఆర్థిక సహాయం అందించారని తెలిపారు.