రూ.30 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధికి గూడూరు ఎమ్మెల్యే శ్రీకారం

రిపోర్టర్: సునీల్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో రూ.30 కోట్ల భారీ నిధులతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ శ్రీకారం చుట్టారు. రోడ్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి చేపట్టి నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.