వీధి దీపాల సమస్యపై వార్తకు స్పందించిన అధికారులు
రిపోర్టర్: KISHORE M
స్థలం: ఆదోని
కపటి గ్రామంలో వీధి దీపాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని డీప్ పల్స్ న్యూస్ ప్రముఖంగా వెలుగులోకి తీసుకురావడంతో పంచాయతీ అధికారులు వెంటనే స్పందించారు. సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు, గ్రామంలో వీధి దీపాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఫలితంగా గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.